Surprise Me!

పాపం..మహేష్ కు ఈ ఏడాది కలిసి రాలేదు ! | Filmibeat Telugu

2017-12-19 104 Dailymotion

2017 is the totally disappointing year for Mahesh Babu and his fans. 'Spyder' movie released this year has not played well at the box office. <br /> <br />తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ స్టార్లలో ఒకరైన మహేష్ బాబుకు 2017 సంవత్సరం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పొచ్చు. గతేడాది బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా చేసిన చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే హిట్, ప్లాపుతో సంబంధం లేకుండా మహేష్ బాబు ఇమేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. <br />ఈ ఏడాది మహేష్ బాబుకు సంబంధించిన మరో రెండు సినిమాలు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అను నేను'. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2018 తొలి త్రైమాసికంలో విడుదల కానుంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో పాటు త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Buy Now on CodeCanyon